తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  • ఈ నెల 9న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు
  • ఆర్థిక మంత్రిగా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్
  • బీఏసీ సమావేశంలో సమావేశాల పూర్తి ఎజెండా నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ రోజున ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల పూర్తి ఎజెండాతోపాటు పనిదినాలను బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు.

అదే రోజున ఆర్థిక మంత్రిగానూ వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఓ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ మంత్రి ఎవరనేది తెలియాల్సి ఉంది. నిజానికి బడ్జెట్ సమావేశాలను ఈ నెల 4, 9, 14 తేదీల్లో ఏదో ఒక రోజున ప్రారంభించాలని ప్రతిపాదించారు. అయితే, అన్ని విషయాలు చర్చించిన అనంతరం చివరికి 9వ తేదీని నిర్ణయించారు.
Go Back to Shorts
Telangana
Budget
KCR
Telangana Assembly

More Telugu News